Type Here to Get Search Results !

భక్తిశ్రద్ధలతో మాంకాళమ్మ వేడుకలు.. పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి

 

ఘనంగా మాంకాళమ్మ పలహారం బండి, తొట్టెల ఊరేగింపు

వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట, ఆగస్టు 11 (తెలుగు ట్రెండ్స్):
రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీలో మాంకాళమ్మ ఆలయం వద్ద నిర్వహించిన పలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాంకాళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం పలహారం బండి, తొట్టెల ఊరేగింపులో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.


కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language