కుడిచెరువుకు గండి.. రైతుల సమాచారంతో స్పందించిన అధికారులు

 

కుడిచెరువుకు గండి.. రైతుల సమాచారంతో స్పందించిన అధికారులు


సకాలంలో మరమ్మతు పనులు.. అధికారుల తక్షణ స్పందనపై రైతుల హర్షం

తెలుగు ట్రేండ్స్, వెల్దుర్తి మండలం, ఆగస్టు 08:
వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడిచెరువుకు గండి పడటంతో చెరువులోని నీరు వృథాగా పోతుండటాన్ని రైతులు గుర్తించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో చెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో గండి పడినట్లు రైతులు తెలిపారు.

ఈ విషయాన్ని రైతులు వెంటనే నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి గండి పూడ్చే మరమ్మతు పనులను ప్రారంభించారు.

చెరువులో నిల్వ ఉన్న నీరు వృథాగా పోకుండా గండిని పూర్తిస్థాయిలో పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో చెరువులోని నీటిని కాపాడే అవకాశం ఏర్పడిందని రైతులు తెలిపారు.

సకాలంలో స్పందించి మరమ్మతు పనులు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యపై అధికారులు వెంటనే స్పందించిన తీరును పలువురు అభినందించారు.

0/Post a Comment/Comments

ads

ads