Type Here to Get Search Results !

రామాయంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

 



రామాయంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

రామాయంపేట, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణ తొలి రాజుగా, బహుజన రాజాధికార పోరాట యోధుడిగా పేరుగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దొరలు, అరాచకవాదులు, మొగలాయి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ సాగించిన పోరాటాన్ని, బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.

సామాజిక సమానత్వం, బహుజనుల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు గుగ్గులోతు రవి, పుట్టి సందీప్, దేవుని రంజిత్, కోఆప్షన్ సభ్యుడు మోబిన్, కాంగ్రెస్ నాయకులు మట్టి యాదగిరి, పచ్చంటి రాములు, ఎర్రం సత్యం, యువ నాయకులు విరాట్, నరేష్, సుధీర్ గౌడ్, నితిన్ గౌడ్, అరవింద్‌తో పాటు గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్
రామాయంపేట రిపోర్టర్: బి. యాదగిరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language