Type Here to Get Search Results !

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహణ.. రామాయంపేట ఫోటోగ్రాఫర్ల సంఘ భవనానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి

 


ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహణ

రామాయంపేట, ఆగస్టు 19: కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని రామాయంపేట మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రొయ్యల హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు ఆనంద్, కోశాధికారి వినోద్‌తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ రామాయంపేట మండలంలో 100 మందికి పైగా ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

ఫోటోగ్రాఫర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మెయిన్‌పల్లి రోహిత్‌రావు, మున్సిపల్ చైర్మన్ స్పందించి సంఘ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రత్యేకంగా సంఘ భవనం ఉంటే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఫోటోగ్రఫీ వృత్తి సమాజంలో ఎంతో కీలకమైనదని, ముఖ్యమైన సంఘటనలను, కుటుంబాల మధుర జ్ఞాపకాలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో ముఖ్యమని సభ్యులు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సహకరించాలని కోరారు.

తెలుగు ట్రెండ్స్
బి. యాదగిరి – రామాయంపేట

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language