Type Here to Get Search Results !

వెల్దుర్తిలో ఆషాఢ మాస మెహందీ సందడి.. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

 

ఆషాఢ మాసంలో మెహందీ సందడి.. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ వెల్దుర్తి

వెల్దుర్తి, ఆగస్టు 11:




ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థుల ఆధ్వర్యంలో మెహందీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపింది.

ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు వివిధ రకాల అందమైన మెహందీ డిజైన్లను వేసుకుంటూ సందడి చేశారు. సంప్రదాయ కళలు, భారతీయ సంస్కృతి పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను వెలికితీయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు.

తరగతి గదిలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, పరస్పర స్నేహభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు అర్చన, అమూల్య, నవనీత, సునీత, జయసుధ, వానిశ్రీ, ప్రశాంతి, రాధిక, ప్రియదర్శిని తదితరులతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – మెదక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language