Type Here to Get Search Results !

దుబ్బాకలో ఘోర ప్రమాదం.. బావిలో కారు బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

 

దుబ్బాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సిద్దిపేట జిల్లా, దుబ్బాక: అదుపుతప్పిన కారు వేగంగా వెళ్తూ పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), ఆయన భార్య భార్గవి (25), కుమారుడు నివర్త్ (4), కుమార్తె శాన్విక (2) మృతి చెందారు. సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బావిలో మునిగిపోయిన కారును, మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెంది

Ai ఫోటో 

న నలుగురు మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language