Type Here to Get Search Results !

మా భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.. దొంగ రిజిస్ట్రేషన్ జరగలేదు: కాసుల మహాలక్ష్మి

 


మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. భూమిని లాక్కునేందుకు యత్నం

దొంగ రిజిస్ట్రేషన్ జరగలేదు.. అధికారులే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు: కాసుల మహాలక్ష్మి

మనోహరాబాద్, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టబద్ధంగానే రిజిస్ట్రేషన్ జరిగిందని కాళ్లకల్ గ్రామానికి చెందిన కాసుల మహాలక్ష్మి తెలిపారు. కావాలనే తమ భూమిని లాక్కునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాలక్ష్మి మాట్లాడుతూ కాళ్లకల్ గ్రామానికి చెందిన వర్గంటి దశరథ తన వాటాకు వచ్చే 7.01 ఎకరాల భూమిని తమకు ఏజీపీఏ చేసి విక్రయించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దశరథ అన్నదమ్ములు తమ భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తాము దశరథకు డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేశామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం అధికారులు చట్టబద్ధంగానే రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అయినప్పటికీ అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్‌ను అక్రమంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

“మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దొంగ రిజిస్ట్రేషన్ జరగలేదు. అధికారులే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు. కేవలం బెదిరింపులకు పాల్పడితే అక్రమం సక్రమం అవుతుందా?” అని మహాలక్ష్మి ప్రశ్నించారు.

తమ భూమిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమకు ప్రాణభయం ఉందని, అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని మహిళా రైతు కోరారు.

రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్
తెలుగు ట్రెండ్స్ – మనోహరాబాద్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language