Type Here to Get Search Results !

ఇస్లాంపూర్‌లో ఫారం పాండ్ పనుల పరిశీలన.. రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు: డీఆర్‌డీఓ

 



ఇస్లాంపూర్‌లో ఫారం పాండ్ పనులను పరిశీలించిన మెదక్ డీఆర్‌డీఓ

తూప్రాన్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): ఇస్లాంపూర్ గ్రామపంచాయతీలో VB-GRAMG జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఫారం పాండ్ పనులను మెదక్ డీఆర్‌డీఓ శ్రీనివాస్ రావు గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారం పాండ్ పనుల నాణ్యత, కొలతలు, అమలు విధానాన్ని పరిశీలించిన డీఆర్‌డీఓ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డీఆర్‌డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. మండలంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఫారం పాండ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మండలంలో మరిన్ని ఫారం పాండ్ పనులను చేపట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అర్హత కలిగిన రైతులను గుర్తించి జలసిరి కార్యక్రమం ద్వారా ఫారం పాండ్ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంచడంతో పాటు రైతులకు సాగునీటి వసతి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ పి. సంతోష్ రెడ్డి, టీఏ సత్యం, పంచాయతీ కార్యదర్శి కల్పన, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు.

తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language