Type Here to Get Search Results !

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ డీఎంహెచ్‌వో

 


సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వైద్యాధికారులు, పీహెచ్‌సీ సిబ్బందితో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్ సమీక్ష

తెలుగు ట్రెండ్స్ | వెల్దుర్తి | ఆగస్టు 1:

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యశాఖ మరింత అప్రమత్తంగా పనిచేయాలని మెదక్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్ సూచించారు. శనివారం వెల్దుర్తి మండల కేంద్రంలో తూప్రాన్ డివిజనల్ పీహెచ్‌సీ పరిధిలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సూచనలు అందించాలని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. ఓపీ సేవలను మెరుగుపరుస్తూ, ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసాన్ని పెంపొందించాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ హాస్టళ్లలోని వంటశాలలు, ఆహార నిల్వ గదులను తరచుగా తనిఖీ చేసి పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా చూడాలని, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

తూప్రాన్ డివిజన్‌లో ఆరోగ్య సూచికలను మెరుగుపరిచేందుకు ప్రతి వైద్యాధికారి కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని డాక్టర్ అనిల్ సూచించారు.

ఈ సమావేశంలో వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష, డాక్టర్ సౌజన్య, చేగుంట, మనోహరాబాద్ మండలాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు (MLHPs), టీబీ సూపర్వైజర్లు, ఆర్బీఎస్‌కే (RBSK) బృందాల సభ్యులు, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language