Type Here to Get Search Results !

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా శేఖర్ గౌడ్

 బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా శేఖర్ గౌడ్


నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్



వెల్దుర్తిమండలం,ఆగస్టు 08 తెలుగు ట్రేండ్స్ 


భారతీయ జనతా పార్టీ వెల్దుర్తి మండలానికి చెందిన కోదండ శేఖర్ గౌడ్‌ను జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు.పార్టీ బలోపేతానికి కోదండ శేఖర్ గౌడ్ అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా అధ్యక్షుడు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కోదండ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, సిద్ధాంతాల ప్రచారం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు జనార్ధన్ చారి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్రీనివాస్, చందు, పవన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోదండ శేఖర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language