Type Here to Get Search Results !

కొల్చారంలో మహిళలకు కుట్టు శిక్షణ.. స్వయం ఉపాధికి బాట



 

కొల్చారంలో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరం

కొల్చారం, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్): మహిళలు స్వయం శక్తితో ఎదిగి, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కుట్టు శిక్షణ ఎంతో దోహదపడుతుందని మెదక్ మిల్లీ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.

మంగళవారం కొల్చారం మండల కేంద్రంలో మెదక్ మిల్లీ అసోసియేషన్ సౌజన్యంతో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాన్ని మెదక్ మిల్లీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ ఖాన్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ రియాజోద్దీన్, సుప్రీం బాడీ మెంబర్ మీర్ జాఫరుల్లా తహెర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు కుట్టు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ కొనసాగుతుందని, మూడు నెలల నిర్ణీత వ్యవధిలో శిక్షణ పూర్తవుతుందని చెప్పారు.

కులమతాలకు అతీతంగా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జెలే నజీమా, ఇన్‌చార్జి సానియా సమీరా, శిక్షకురాలు హైమాది బేగం, స్థానికులు అరిఫోద్దీన్, ఖదీర్, హైమద్, సమీర్, ఆర్షద్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్
కొల్చారం రిపోర్టర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language