Type Here to Get Search Results !

తూప్రాన్ మున్సిపాలిటీ సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డులు

 తూప్రాన్ మున్సిపాలిటీ సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డులు


తూప్రాన్ (తెలుగు ట్రేండ్స్): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తూప్రాన్ మున్సిపాలిటీలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 'ఉత్తమ ఉద్యోగి' అవార్డులు లభించాయి.

మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. ప్రసన్న కుమార్, శానిటేషన్ వర్కర్ జి. సత్యనారాయణలు అందించిన ఉత్తమ సేవలను గుర్తించి అధికారులు వారిని ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమ సింగ్ ల చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ K. రమేష్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడంలో ప్రతీ ఉద్యోగి కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. విధి నిర్వహణ పట్ల నిబద్ధత, సమయపాలన, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఉత్తమ అవార్డులు అందుకున్న ప్రసన్న కుమార్, సత్యనారాయణలను అభినందిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language