Type Here to Get Search Results !

పరిశుభ్ర మెదక్‌కు ప్రజల సహకారం అవసరం: మున్సిపల్ చైర్‌పర్సన్


నాలుగు రకాల చెత్త వేర్వేరుగా సేకరించాలి

మెదక్‌లో పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం.. వార్డులు 21, 22లో చెత్త బుట్టల పంపిణీ

తెలుగు ట్రెండ్స్ | మెదక్ | ఆగస్టు 1:

ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళి–2026 అమలులో భాగంగా మెదక్ పురపాలక సంఘం పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, హానికర, స్పెషల్ కేర్ చెత్తను విడివిడిగా సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వార్డు నంబర్లు 21, 22లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి శనివారం ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.

ఇటీవల మెదక్ మున్సిపాలిటీకి లేబర్ కాంట్రాక్టర్ వి. సారంగపాణి విరాళంగా అందజేసిన చెత్త బుట్టలను మున్సిపల్ చైర్‌పర్సన్ కనుగు రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ వై. నవీన్, సంబంధిత వార్డుల కౌన్సిలర్ల సమక్షంలో ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కనుగు రాధిక భూపతి రాజు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో తడి, పొడి, హానికర, స్పెషల్ కేర్ చెత్తను వేర్వేరుగా ఉంచి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో 21, 22 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వై. నవీన్, మేనేజర్, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, వార్డు అధికారులు, శానిటరీ సిబ్బంది, ఇతర మున్సిపల్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language