Type Here to Get Search Results !

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టుకు రాజకీయ నాయకుల ఆర్థిక చేయూత

 


రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టుకు ఆర్థిక సహాయం

రామాయంపేట, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జర్నలిస్టు కుస్తీ నారాయణను పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. దామరచెరువు గ్రామానికి చెందిన కుస్తీ నారాయణ ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సుమారు 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆయన కాలు విరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

నారాయణ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ గురువారం దామరచెరువు గ్రామానికి చేరుకుని నారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నారాయణను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం నాయకులు నారాయణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రమాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులకు ఆపద సమయంలో అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు డి.జీ. శ్రీనివాస శర్మ, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి వూడెం దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి రమేష్ గౌడ్, రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం, రామాయంపేట ప్రెస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పటేరి రాము, బీఆర్‌ఎస్ నాయకులు భానుచందర్, శివ, లీలా గ్రూప్ సభ్యులు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట రిపోర్టర్: బి. యాదగిరి | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language