Type Here to Get Search Results !

కోనాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు

 


కోనాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు

రామాయంపేట, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట వైపు నుంచి వస్తున్న కారు కోనాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు దంపతులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట రిపోర్టర్ బి. యాదగిరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language