Type Here to Get Search Results !

పోచారం డ్యామ్‌పై పొంగిపొర్లుతున్న వరద.. సందర్శకులకు పోలీసుల హెచ్చరిక

 




పోచారం డ్యామ్‌పై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని హవేళిఘనపూర్ పోలీసుల సూచన

హవేళిఘనపూర్, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెదక్–కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ పూర్తిస్థాయిలో నిండిపోయి అలుగు మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యామ్ అందాలను వీక్షించేందుకు మెదక్ జిల్లా సహా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో సందర్శకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హవేళిఘనపూర్ పోలీసులు సూచించారు. వరద నీటి ప్రవాహానికి దగ్గరగా వెళ్లకుండా, సురక్షిత దూరం నుంచే డ్యామ్‌ను వీక్షించాలని తెలిపారు. సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

చిన్నారులతో వచ్చే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని హవేళిఘనపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language