బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం.. మాసాయిపేటలో హెచ్పీవీ టీకాల పంపిణీ

 

బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యం.. మాసాయిపేటలో హెచ్పీవీ టీకాల పంపిణీ



గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ కీలకమని వైద్యుల అవగాహన

వెల్దుర్తి, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):

మాసాయిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో అర్హులైన విద్యార్థినులకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, సరైన వయస్సులో ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. అర్హులైన బాలికలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తప్పనిసరిగా హెచ్పీవీ టీకా తీసుకోవాలని సూచించారు.

టీకా కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని విద్యార్థినులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

0/Post a Comment/Comments

ads

ads