Type Here to Get Search Results !

పోతరాజుల కోలాహలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సందడి


మెదక్ ఫలహారం బండి ఉత్సవాల్లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సందడి

మెదక్, ఆగస్టు 3 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఫలహారం బండి ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు, పట్టణ నాయకులతో కలిసి పోతరాజుల విన్యాసాల మధ్య ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో జరిగిన ఫలహారం బండి ఉత్సవాలు మెదక్ పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language