Type Here to Get Search Results !

సునీతమ్మ ఉద్యోగ మిత్ర' యాప్ ఆవిష్కరణ.. నిరుద్యోగులకు ఎమ్మెల్యే సునీత రెడ్డి బిగ్ గిఫ్ట్!

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 'సునీతమ్మ ఉద్యోగ మిత్ర' యాప్ ఆవిష్కరణ!

లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తాం: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

 ఘనంగా స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి వేడుకలు

  రక్తదాన శిబిరం ఏర్పాటు.. స్వయంగా రక్తదానం చేసిన ఎమ్మెల్యే

నర్సాపూర్ (తెలుగు ట్రేండ్స్):

నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు 'సునీతమ్మ ఉద్యోగ మిత్ర' (Sunithamma Udyoga Mitra) యాప్‌ను రూపొందించినట్లు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.

శనివారం నాడు నర్సాపూర్ లోని లయన్స్ క్లబ్ ఆవరణలో స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ లో ఉన్న లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాయి కృష్ణ గార్డెన్ లో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో పాల్గొని, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే స్వయంగా రక్తదానం చేశారు.

'సునీతమ్మ ఉద్యోగ మిత్ర' యాప్ ప్రత్యేకతలు:

  ఉద్యోగ సమాచారం: నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగ ప్రకటనలు, ఖాళీల వివరాలను ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు.

 పోటీ పరీక్షల వివరాలు: వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తారు.

  ఉచిత స్టడీ మెటీరియల్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచితంగా స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచనున్నారు.

 ఉచిత వినియోగం: ఈ మొబైల్ యాప్‌ను నిరుద్యోగ యువతీ యువకులు పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చు. త్వరలోనే ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజా సంక్షేమమే పరమావధి:

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ లక్ష్మారెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. లక్ష్మారెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. "మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తాం. పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం" అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, మొయిజుద్దీన్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబల బిక్షపతి, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, రింగుల ప్రసాద్, జ్ఞానేశ్వర్ గుప్తా, నాగరాజు గౌడ్, శ్రవణ్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, లక్ష్మారెడ్డి అభిమానులు భారీగా పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language