గాయపడిన జర్నలిస్టుకు అండగా కౌన్సిలర్.. ఆర్థిక సాయం అందజేత

 


ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టుకు కౌన్సిలర్ ఆర్థిక సాయం

రామాయంపేట, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స పొందుతున్న రామాయంపేట ప్రెస్‌క్లబ్ సభ్యుడు కుస్తీ నారాయణను శుక్రవారం ప్రెస్‌క్లబ్ సభ్యులు పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన జర్నలిస్టులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జర్నలిస్టు నారాయణకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రామాయంపేట 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత ఆయనను పరామర్శించి నగదు ఆర్థిక సాయం అందించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా భవిష్యత్తులో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా సంయుక్త కార్యదర్శి మర్కు నగేష్, రామాయంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యం, ప్రధాన కార్యదర్శి రాగి లింగం, సంయుక్త కార్యదర్శి రామారపు యాదగిరి, బీఆర్‌ఎస్ నాయకుడు అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట రిపోర్టర్ బి. యాదగిరి

0/Post a Comment/Comments

ads

ads