Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్ భారీగా రేషన్ బియ్యం పట్టివేత

 


బ్రేకింగ్ న్యూస్

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నర్సాపూర్, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్): పేదల కోసం ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న మాఫియా దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని గోండియాకు లారీలో గుట్టుగా తరలిస్తున్న సుమారు 350 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గురువారం నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు.

సివిల్‌ సప్లై డీఎస్పీ వెంకటేశం ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం లారీని లింగాపూర్‌లోని తిరుమల ఆగ్రో మిల్లుకు తరలించారు.

ఇంత భారీ మొత్తంలో పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language