Type Here to Get Search Results !

జహీరాబాద్‌లో భాజపా భారీ తిరంగా ర్యాలీ

 

జహీరాబాద్‌లో భాజపా భారీ తిరంగా ర్యాలీ

జహీరాబాద్‌, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక లైఫ్‌స్టైల్‌ కాలేజీ వద్ద మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. లైఫ్‌స్టైల్‌ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌ చౌక్‌ మీదుగా ఇబీ గెస్ట్‌హౌస్‌ వరకు కొనసాగింది. మార్గమంతా దేశభక్తి నినాదాలతో జహీరాబాద్‌ పట్టణంలో సందడి నెలకొంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు.

ఈ ర్యాలీలో జహీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ నర్సింహా, జహీరాబాద్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language