మెదక్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
మెదక్, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్ – మెదక్): తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మెదక్‌లో ఘనంగా నిర్వహించారు. సాయి బాలాజీ గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్ సమక్షంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సాయి బాలాజీ గార్డెన్ నుంచి రామ్‌దాస్ చౌరస్తా వరకు ఫోటో, వీడియో గ్రాఫర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
ఫోటోగ్రఫీకి 187 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఫోటోగ్రాఫర్ల సమక్షంలో కనిష్ట ధరల పట్టికను విడుదల చేశారు.
జిల్లాలోని సీనియర్ ఫోటో, వీడియో గ్రాఫర్లను జిల్లా అధ్యక్షుడు కంచి ఆనంద్ ఆధ్వర్యంలో శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్, సాయి దత్త హాస్పిటల్ డాక్టర్ పెంట గౌడ్, హెచ్‌డీఎఫ్‌సీ రీజినల్ మేనేజర్ రాఘవేంద్రరావు, అర్జున్ హాస్పిటల్ డాక్టర్ తిరుమలేష్, డాక్టర్ స్వాతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి దాసరి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్పల్లి సురేష్, జిల్లా గౌరవ సలహాదారులు బచ్చు బసవరాజ్, ఆడెపు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ చంద్రశేఖర్, కోశాధికారి కూచన శ్రీధర్, మెదక్ మండల అధ్యక్షుడు సురేందర్, కోశాధికారి శ్రీకాంత్‌తో పాటు జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – మెదక్


కామెంట్‌ను పోస్ట్ చేయండి