కార్యకర్తలే నా బలం.. మీకు అండగా ఉంటా
బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి భరోసా
కొల్చారం, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. “మీరు నా బలం.. బలగం. మీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ వెన్నంటే ఉంటా” అని ఆమె అన్నారు.
బుధవారం కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కొనపూర్ సంతోష్‌రావు అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ నుంచి బాజాభజంత్రీలు, డప్పుల చప్పుళ్లతో ర్యాలీ నిర్వహిస్తూ టపాకాయలు పేల్చి ఆమెను సమావేశ ప్రాంగణానికి తీసుకువచ్చారు.
సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ పరిస్థితిపై తమ అభిప్రాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కొనపూర్ సంతోష్‌రావు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు యబన్నగారి రవితేజరెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, ఆర్. బాగారెడ్డి, రాజాగౌడ్, మాజీ జడ్పీటీసీ సంతోష్ తదితరులు ప్రసంగించారు. వారి ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అరిగే రమేష్, సర్పంచ్‌లు స్వామి, వినోద్ నాయక్, మోహన్, గీత రమేష్, నిర్మల మల్లేశం, దొడ్ల ఆంజనేయులు, కన్నెబోయిన సుజాత, షేకులు లక్ష్మీ, నాయకులు వేమారెడ్డి, అరె రవీందర్, సాయిని సిద్ధిరాములు, కమ్ముల సురేష్, ధనరాజ్ తదితరులతో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – కొల్చారం



కామెంట్‌ను పోస్ట్ చేయండి