యువతను పక్కదారి పట్టకుండా.. డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం
రామాయంపేట, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): యువత డ్రగ్స్ బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రామాయంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో శుక్రవారం యాంటీ డ్రగ్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో బాపనయ్య మెతుకుల తండా, బాల్య తండాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఇటీవల గంజాయి చాక్లెట్ల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.
తెలుగు ట్రెండ్స్ – రామాయంపేట రిపోర్టర్ బి. యాదగిరి


కామెంట్‌ను పోస్ట్ చేయండి