Type Here to Get Search Results !

అన్ని సంస్కృతులకు సమాన గౌరవమే భారతీయత: మాద్రి పృథ్వీరాజ్

 

"బోల్ భమ్" ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

హైదరాబాద్, ఆగస్టు 3 (తెలుగు ట్రెండ్స్):
జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో నివసిస్తున్న ఉత్తర భారత, ఒడిశా ప్రాంతానికి చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్ర "బోల్ భమ్" ఆధ్యాత్మిక ఉత్సవంలో బీఆర్ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులను, భక్తులను


ఆప్యాయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు భారతదేశ గొప్పతనానికి ప్రతీకలని, అన్ని సంస్కృతులు, అన్ని సంప్రదాయాలకు సమాన గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పరస్పర గౌరవం, సర్వమత సౌహార్దం, సామరస్యమే సమాజ ఐక్యతకు బలమని ఆయన అన్నారు. "ప్రజల మధ్యే – ప్రజలతోనే నా జీవితం" అనే భావనతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language