Type Here to Get Search Results !

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి ఘన సన్మానం ఆర్మూర్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

 


జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌కు ఘన సన్మానం

సిద్దిపేట , ఆగస్టు 16 (తెలుగు ట్రెండ్స్): ఆర్మూర్ పట్టణంలో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) చైర్మన్ పల్లె గంగారెడ్డిని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పల్లె గంగారెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు.

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నాయకులు.. పసుపు రైతుల సమస్యలు, పసుపు పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు, పసుపు ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

తెలంగాణలో పసుపు సాగు చేస్తున్న రైతులకు జాతీయ పసుపు బోర్డు ద్వారా మరింత ప్రయోజనం కలగాలని, పసుపు ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. పసుపు రైతుల సంక్షేమానికి బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి కృషి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, బీజేపీ నాయకులు అనిల్ యాదవ్, నత్తి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.                   రిపోర్ట్ R చంద్రశేఖర్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language