Type Here to Get Search Results !

పాపన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


 పాపన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


పాపన్నపేట, ఆగస్టు 10 (తెలుగు ట్రెండ్స్):

పాపన్నపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ (40) మృతి చెందారు. కొత్తపల్లి నుంచి పాపన్నపేట వైపు కృష్ణ తన బావమరిదితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరో ద్విచక్ర వాహనంపై మెదక్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొన్నట్లు సమాచారం.


ఈ ప్రమాదంలో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం.


కృష్ణ మృతదేహాన్ని మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణకు భార్య, కుమార్తె ఉన్నారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు ట్రెండ్స్


| మెదక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language