Type Here to Get Search Results !

ఎంపీ రఘునందన్ రావును కలిసిన పాపన్నపేట బీజేపీ నూతన కార్యవర్గం

 



ఎంపీ రఘునందన్ రావును కలిసిన పాపన్నపేట బీజేపీ నాయకులు

పాపన్నపేట, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును పాపన్నపేట మండల బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అధ్యక్షుడు సంతోష్ చారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ మోర్చాల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు ఎంపీని కలిసి ఏడుపాయల వనదుర్గామాత జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంతోష్ చారి మాట్లాడుతూ.. పాపన్నపేట మండలంలోని పలు సమస్యలను ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎంపీ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

అనంతరం ఎంపీ రఘునందన్ రావు నూతన మండల కమిటీ, మోర్చాల అధ్యక్షులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, ధార్మిక సెల్ సెక్రటరీ సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, నాగభూషణం, మండల ఉపాధ్యక్షుడు బొక్కల భాగేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వడ్ల భాగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు జిన్నగోపాల్, యువమోర్చా అధ్యక్షుడు జగదీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మన్నె సుమలత, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాబు, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వెంకట్ నాయక్, బీజేవైఎం శ్రవణ్, బూత్ అధ్యక్షుడు సాయిలు, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నాయి కోటి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – పి. శ్రీనివాస్, పాపన్నపేట

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language