Type Here to Get Search Results !

బీజేపీ మహిళా మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా కుమ్మరి మౌనిక

 


బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా కుమ్మరి మౌనిక

వెల్దుర్తి మండలం, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మౌనికను బీజేపీ మహిళా మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించినట్లు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మౌనికకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కుమ్మరి మౌనిక మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పట్లోళ్ల మల్లికా అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తానని చెప్పారు.

మహిళలను పెద్ద సంఖ్యలో పార్టీ వైపు తీసుకురావడంతో పాటు, బీజేపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని మౌనిక పేర్కొన్నారు. మహిళా సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

అనంతరం మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులకు బీజేపీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. మౌనికను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించడం ద్వారా ఆమెకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.

మౌనిక నియామకంతో మానేపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

వెల్దుర్తి మండల రిపోర్టర్: నరసింహా గౌడ్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language