Type Here to Get Search Results !

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

 


రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

రామాయంపేట: మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో కీలకమైనవని నాయకులు స్మరించుకున్నారు.

రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రామాయంపేట రిపోర్టర్: బి. యాదగిరి | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language