Type Here to Get Search Results !

హత్నూర సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి

 


హత్నూర సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి

సంగారెడ్డి  హత్నూర


, ఆగస్టు 7:

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్‌లతో ఆయన ఆత్మీయంగా సమావేశమై గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

అనంతరం సర్పంచ్‌లు ఆవుల రాజిరెడ్డిని ఘనంగా సన్మానించి ఆత్మీయంగా స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, హత్నూర మండల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language