ఇస్నాపూర్‌లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
ఇస్నాపూర్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఫొటోగ్రాఫర్లకు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం, ప్రజా ఉద్యమం, సామాజిక పరిణామం, కుటుంబ వేడుకలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నాటి జ్ఞాపకాలను కళ్లముందు నిలిపేది ఫొటోగ్రఫీ అని పేర్కొన్నారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకుని ప్రజలకు సేవలందిస్తున్న ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఫొటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని నీలం మధు తెలిపారు. గతంలో ఫొటోగ్రాఫర్ల కోసం తాను చేపట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫొటోగ్రాఫర్ల సంక్షేమం, వారి వృత్తిపర
మైన అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి రాజేశ్వర్, ఇస్నాపూర్ ప్రెసిడెంట్ నరేందర్, శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సందీప్, కౌన్సిలర్లు సంఘన్నగారి గోపాల్, దస్తగిరి, లక్ష్మారెడ్డి, మురళి, కృష్ణ యాదవ్, శంకర్, పవన్, రవి, రాజేష్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ ఇస్నాపూర్



కామెంట్‌ను పోస్ట్ చేయండి