పాపన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లింగంపేట నరేందర్ గౌడ్
పాపన్నపేట, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నుకున్నట్లు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడిగా లింగంపేట నరేందర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా కన్నెగంటి వెంకటకృష్ణ (నాని, లక్ష్మీనగర్), హీరాలాల్ (డాక్య తండా), రవి (పాడిచన్ పల్లి తండా), రాజశేఖర్ (అరెపల్లి)లను ఎంపిక చేశారు. ట్రెజరర్‌గా కొణింటి రాజేందర్ (కుర్తివాడ)ను నియమించారు.
ప్రధాన కార్యదర్శులుగా నీరుడి రమణ (చీకోడ్), బ్యాగరి బాబు (గాంధారిపల్లి), సాలె హనుమంతు (కొడపాక), భూమన్నల రవీందర్ (సీతానగర్), ముచ్చ బాగయ్య (ఆర్కెల), పుట్టల దుర్గయ్య (గాజులగూడెం)లను ఎన్నుకున్నారు.
కార్యదర్శులుగా చాకలి నర్సింలు (నార్సింగి), కుర్మ నాగరాజు (ముద్దాపురం), లక్ష్మపురం మల్లేశం (పాత లింగయ్యపల్లి), పిల్లుట్ల పోచయ్య (దౌలాపూర్), కట్ట సుధాకర్ (రామతీర్థం), తిప్పపురం రమేష్ గౌడ్ (కొత్తపల్లి), తలారి యాదగిరి (నాగ్సన్‌పల్లి), బొల్లి కిరణ్ (యూసుఫ్‌పేట), బానోత్ రాజు (మోదలకుంట తండా), కర్రోళ చంద్రశేఖర్ (బాచారం)లను ఎంపిక చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మండలంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. నూతన అధ్యక్షుడు లింగంపేట నరేందర్ గౌడ్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
పాపన్నపేట మండల రిపోర్టర్: పి. శ్రీనివాస్ | తెలు
గు ట్రెండ్స్



కామెంట్‌ను పోస్ట్ చేయండి