Type Here to Get Search Results !

మాజీ మంత్రి గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌ వాల్‌ ధ్వంసం.. గ్రామస్తుల ఆగ్రహం

 

మాజీ మంత్రి గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్‌ వాల్‌ ధ్వంసం.. గ్రామస్తుల ఆగ్రహం

పంట పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తున్నారంటూ


ఆందోళన

నార్సింగి, ఆగస్టు 8 (అక్షర కలం):
మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ గ్రామంలో మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్‌హౌస్‌ వద్ద నిర్మిస్తున్న కాంపౌండ్‌ వాల్‌ను గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ పంట పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తూ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

జాతీయ రహదారి పక్కన ఉన్న గెస్ట్‌హౌస్‌ వద్ద కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపట్టారని, దీంతో తమ వ్యవసాయ భూములకు వెళ్లే దారి మూసుకుపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఏళ్లుగా ఇదే మార్గం ద్వారా పంట పొలాలకు రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు.

గతంలోనే ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించారని గ్రామస్తులు ఆరోపించారు. తమ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయవద్దని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గ్రామస్తులు కాంపౌండ్‌ వాల్‌ను ధ్వంసం చేయడంతో జప్తి శివునూర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language