మెదక్ సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెసిబిటర్ ఇన్‌చార్జి రెవ. శాంతయ్య
మెదక్, ఆగస్టు 15: మెదక్ సీఎస్‌ఐ చర్చి వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రెసిబిటర్ ఇన్‌చార్జి రెవ. శాంతయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెవ. శాంతయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులందరూ రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అసమానతలు లేని భారతదేశం ఏర్పడాలని ఆకాంక్షించారు.
మహాత్మా గాంధీ అహింసా మార్గంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధానాన్ని స్మరించుకున్నారు. అదే విధంగా యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సేవా భావాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.
చర్చి సెక్రటరీ గెలన్ చిత్తరంజన్ మాట్లాడుతూ.. క్రైస్తవులందరూ ముందుగా భారతీయులమనే భావన కలిగి ఉండాలని, ఆ తర్వాతే క్రైస్తవులమని అన్నారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చర్చి పాస్టర్లు రెవ. డేవిడ్ రీచార్డ్స్, జైపాల్, శ్రీనివాస్, ఆఫీస్ బేరర్, ప్రభుదయ, కమిటీ నాయకులు జీసీ. సునీల్ , ఫ్రాంక్ జాన్సన్, జాయ్ మూర్రే, 18వ వార్డు కౌన్సిలర్ సూరజ్అనంతరావు, ఎన్. జాన్ వెస్లీ, దుర్గం జాన్ వెస్లీ, మహిళా కార్యదర్శి లిల్లీ గ్రేస్, ప్రాపర్టీ సెక్రటరీ సుశీల్ కుమార్, సీనియర్ సిటిజన్ కన్వీనర్ సీహెచ్. సుధాకర్, కమిటీ సభ్యులు dr రవీందర్ సునీల్ , వికాస్, లీట్టు, జోయల్ చర్చి
సభ్యులు . దేవరాజ్ , సీహెచ్. శాంసన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ రిపోర్ట్ :వికాస్ మెదక్



కామెంట్‌ను పోస్ట్ చేయండి