Type Here to Get Search Results !

రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం :బీజేపీ రాష్ట్ర నాయకుడు


 

రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రామాయంపేట: రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మెదక్ జిల్లా నాయకులు రాగి రాములు ఆరోపించారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 45 కిలోల యూరియా బస్తాను సుమారు రూ.262–266కే అందిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఖర్చుల పేరుతో రైతులపై బస్తాకు రూ.36–38 అదనపు భారం వేయడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రానికి అవసరమైన యూరియా కేంద్రం సరఫరా చేస్తున్నా, పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృత్రిమ కొరత, అధిక ధరలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ డిమాండ్లు:
• యూరియా సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి.
• రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
• రైతులపై రూ.36–38 అదనపు భారాన్ని తొలగించాలి.
• కృత్రిమ కొరత, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి.
• రైతులకు అవసరమైన మేరకు యూరియాను సకాలంలో అందుబాటులో ఉంచాలి.

రైతులపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాగి రాములు డిమాండ్ చేశారు.

తెలుగు ట్రెండ్స్ బి యాదగిరి,రామాయంపేట 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language