ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాబుకు.. ప్రాణం పోసిన డాక్టర్ ప్రదీప్ రావు
రామాయంపేట, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన నవజాత శిశువుకు సకాలంలో ప్రత్యేక చికిత్స అందించి వైద్యులు ప్రాణాలు కాపాడారు. చికిత్స అనంతరం బాబు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామానికి చెందిన పాట్లూరి శోభ–చంటి దంపతులకు ఈ నెల 5న మెదక్‌లోని ఓ ఆస్పత్రిలో బాబు జన్మించాడు. పుట్టిన రెండు రోజులకే బాబు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
అయితే తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తీసుకెళ్లకుండా రామాయంపేట పట్టణంలోని రాజరాజేశ్వరి పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ నెల 7న డాక్టర్ ప్రదీప్ రావు నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబుకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించడంతో ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది.
గురువారం బాబు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తమ బాబు తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో డాక్టర్ ప్రదీప్ రావు అందించిన వైద్యం, ఆస్పత్రి సిబ్బంది సహకారంతో ప్రాణాపాయం నుంచి బయటపడి పూర్తిగా కోలుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. తమ బాబును కాపాడిన డాక్టర్ ప్రదీప్ రావు, ఆస్పత్రి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


It's our privilege to have such best doctor(Dr.pradeep Rao ) in ramayampet....
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి