Type Here to Get Search Results !

రాత్రివేళ అక్రమ మట్టి రవాణా.. టిప్పర్ పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు

 


అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు

తూప్రాన్, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్స్): రాత్రి వేళల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను తూప్రాన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి–వెంకటాపూర్ శివారు ప్రాంతం నుంచి తూప్రాన్ వైపు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ అబ్దుల్ అజార్, టిప్పర్ యజమాని ఇతారి కృష్ణపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

అక్రమంగా మట్టి, ఇసుక తదితరాలను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తరలించడం, అక్రమ రవాణాకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

— తూప్రాన్, తెలుగు ట్రెండ్స్ రిపోర్టర్
ఆర్. చంద్రశేఖర్ 🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language