Type Here to Get Search Results !

గిరిజనుల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

 


గిరిజనుల హక్కులపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థ

మెదక్, ఆగస్టు 11:
గిరిజనుల చట్టపరమైన హక్కుల పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా మెదక్ మండల పరిధిలోని సంగాయిగుడి తండాలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి. నీలిమ సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ నాగరాజు మాట్లాడుతూ.. ‘నాల్సా గిరిజన హక్కుల పరిరక్షణ, అమలు పథకం–2015’ ముఖ్య ఉద్దేశ్యం గిరిజనులకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, వారి హక్కులను పరిరక్షించడం అని తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన లేదా న్యాయ సహాయం అవసరమైన గిరిజనులకు న్యాయం అందేలా న్యాయ సేవాధికార సంస్థలు సహకరిస్తాయని చెప్పారు. గిరిజనుల భూమి, జీవనోపాధి, విద్య, సంక్షేమం తదితర అంశాలకు సంబంధించిన సమస్యల్లో అవసరమైన న్యాయ సహాయం అందించడం ఈ పథకంలో కీలక అంశమని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణి చోక్లా, పంచాయతీ కార్యదర్శి కాసిం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ – మెదక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language