Type Here to Get Search Results !

వెంకటాపూర్‌లో ఘనంగా దుర్గామాత కల్యాణ మహోత్సవం

 

వెంకటాపూర్‌లో ఘనంగా దుర్గామాత కల్యాణ మహోత్సవం

రామాయంపేట, ఆగస్టు 8:
మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దుర్గామాత అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు చౌడి రవితేజ బృందం ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు.

సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

– తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language