మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన సంఘసేవకుడు రాజిరెడ్డి
రామాయంపేట, ఆగస్టు 5:
మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన రాచపల్లి బాబు అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రముఖ సంఘసేవకుడు వెంకు గారి రాజిరెడ్డి బుధవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజిరెడ్డి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. అవసరమైన సమయంలో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాచపల్లి సురేష్, రాచపల్లి ఎల్లం, కీసరి రాజా గౌడ్, రాచపల్లి రాజు, రాచపల్లి దుర్గయ్య, పుర్ర స్వామి, కొమ్మగళ్ళ సంతోష్ తదితరులు పాల్గొని మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.b


కామెంట్‌ను పోస్ట్ చేయండి