Type Here to Get Search Results !

పోచమ్మ–దుర్గమ్మకు భక్తుల పోటెత్తిన రద్దీ.. కొల్చారంలో ఘనంగా బోనాల జాతర

 



కొల్చారంలో పోచమ్మ–దుర్గమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహణ

తెలుగు ట్రెండ్స్ | కొల్చారం | ఆగస్టు 02

మెదక్ జిల్లా కొల్చారం గ్రామంలో పోచమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల ఆషాఢ బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు.

జాతర సందర్భంగా శివసత్తుల ఊరేగింపులు, తీన్మార్ డప్పుల సందడి, మంగళ వాయిద్యాలు, కోలాటాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా భక్తజన సందోహంతో కొల్చారం వీధులు కళకళలాడాయి. పోచమ్మ, దుర్గమ్మ ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ దేవన్న, శేఖర్, ఉపసర్పంచ్ కొరంపల్లి రాణి గోపి, మాజీ సర్పంచ్ కరెంట్ రాజా గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, కుమ్మరి నాగరాజు, కృష్ణ, అంజని పుత్ర వనమాల శ్రీధర్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, పాండ్ర వెంకటేశం, సారా సుదర్శన్, ముత్యం రఘు, తమ్మలి సంతోష్, చౌరిగారి సంతోష్, తిమ్మన్నగారి ఆంజనేయులు, మహేశ్వర్ రెడ్డి, సాకేత్, చాకలి శ్రీను, అరికెల నాగయ్య, చింతల శేఖర్, బిట్ల అశోక్, కిరణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, మల్లేశం, ఆనంద్, ముత్యం శ్రీను, అనిల్, చౌదరి సుధాకర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language