జలాల్‌పూర్‌లో గ్రామసభ.. మల్టీపర్పస్ వర్కర్లకు యూనిఫామ్‌లు

 


జలాల్‌పూర్‌లో గ్రామసభ నిర్వహణ.. మల్టీపర్పస్ వర్కర్లకు యూనిఫామ్‌ల పంపిణీ

కొల్చారం, ఆగస్టు 1 (తెలుగు ట్రెండ్స్ కొల్చారం): మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా కొల్చారం మండలం జలాల్‌పూర్ గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ లంబాడి దేవి సింగ్ ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ నాయిని వెంకట నరసింహులు, పంచాయతీ కార్యదర్శి మౌనిక సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీలు, మురికి కాలువల శుభ్రతతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రత్యేక నిధుల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు సర్పంచ్ చేతుల మీదుగా యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధిలో వారి సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మధులత, గంగస్వామి, ప్రసాద్, రమేష్, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, అంగన్‌వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్ నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, నాయకులు కిష్టయ్య, ఏసురాజు, ప్రభాకర్, మల్టీపర్పస్ వర్కర్లు ప్రభుదాసు, శ్రీహరితో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads