Type Here to Get Search Results !

సేవా నిబద్ధతకు ఘన సత్కారం 99 ఏళ్ల ఎస్‌బీఐ పెన్షనర్ మహ్మద్ మియాన్‌కు ఘనంగా సన్మానం

 

సేవా నిబద్ధతకు ఘన సత్కారం

99 ఏళ్ల ఎస్‌బీఐ పెన్షనర్ మహ్మద్ మియాన్‌కు ఘనంగా సన్మానం

జహీరాబాద్, ఆగస్టు 17: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో సుదీర్ఘకాలం సేవలందించిన 99 ఏళ్ల పెన్షనర్ మహ్మద్ మియాన్‌ను ఆయన విశిష్ట సేవలు, విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, వృత్తిపరమైన ప్రతిభకు గుర్తింపుగా ఎస్‌బీఐ అధికారులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ తరఫున మహ్మద్ మియాన్‌కు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది తరఫున సంగారెడ్డి ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సిరాజ్ బాషా పాపా, చీఫ్ మేనేజర్ సంగీత ఈ సత్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. మహ్మద్ మియాన్ తన ఉద్యోగ కాలంలో సంస్థ పట్ల అంకితభావంతో పనిచేశారని తెలిపారు. విధుల నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని, బ్యాంకు అభివృద్ధికి ఆయన అందించిన దీర్ఘకాలిక, విలువైన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

99 ఏళ్ల వయస్సులో తన సేవలను గుర్తించి ఎస్‌బీఐ నుంచి లభించిన ఈ గౌరవం మహ్మద్ మియాన్‌కు ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. సుదీర్ఘకాలం బ్యాంకుకు సేవలందించిన ఆయనను గౌరవించడం తమకు గర్వకారణమని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.

మహ్మద్ మియాన్ చూపిన విధి నిబద్ధత, నిజాయితీ, సేవాభావం నేటి తరం బ్యాంకు ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన సుదీర్ఘమైన, నిస్వార్థ సేవలను అభినందిస్తూ బ్యాంకు అధికారులు, సిబ్బంది, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ట్రేండ్స్ జహీరాబాద్ రిపోర్ట్: నర్సింహా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language