Type Here to Get Search Results !

తూప్రాన్ గీతా స్కూల్‌లో దేశభక్తి వెల్లువ.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

 

గీతా స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తూప్రాన్, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్): తూప్రాన్‌లోని గీతా స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండా రెపరెపలాడగా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దేశభక్తి భావాలతో వేడుకల్లో పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ పి. ఉష జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. రామాంజనేయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని, దేశంపై ప్రేమ, జాతీయ భావాలు కలిగి ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ముఖ్యంగా ఐదో తరగతి విద్యార్థిని వినూతన ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థిని ప్రతిభను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు భరత్, డాక్టర్ మౌనిక, రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, ప్రిన్సిపాల్ అరుణ, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, శాంతి, ఉమారాణి, శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ | తూప్రాన్ శ్రీనివాస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language