Type Here to Get Search Results !

పోతారంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు



పోతారంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్
  • దేశాభివృద్ధిలో యువకులు భాగస్వాములు కావాలని పిలుపు
  • గ్రామాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి

మనోహరాబాద్ (తెలుగు ట్రేండ్స్): మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు, శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందเนీ, ప్రతి ఒక్క యువకుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి అనేది అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో చైతన్యవంతంగా పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఇమ్మడి దుర్గమ్మ, మాజీ సర్పంచ్ పుట్ట ఆంజనేయులు, వార్డు సభ్యులు మన్నె సురేష్, మంద యాదగిరి, షర్మిల, పవన్ గౌడ్, సంకి శ్రీకాంత్, చెలిమెల శ్రీహరి గౌడ్ లతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language