Type Here to Get Search Results !

తూప్రాన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

తూప్రాన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్

తూప్రాన్, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్): తూప్రాన్ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తూప్రాన్ పట్టణంలోని వివిధ సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాల వద్దకు మున్సిపల్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన నిర్వహించారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సమతా కాశి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడడంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో కొనసాగాయి.

తెలుగు ట్రెండ్స్ | తూప్రాన్,  శ్రీనివాస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language