Type Here to Get Search Results !

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళిగా 80 మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు


80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 80 మొక్కలు నాటిన ఉపాధ్యాయులు, విద్యార్థులు

పాపన్నపేట, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): 80 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 80 మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 80 మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించడమే మన స్వాతంత్ర్య సమరయోధులకు అందించే ఘనమైన నివాళి అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని క్రమం తప్పకుండా సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు నాటిన మొక్కలను సంరక్షించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడపాక అనిల్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీలత, కరుణ, వినీత, జ్యోతి, సీఆర్పీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాపన్నపేట మండల రిపోర్టర్: పి. శ్రీనివాస్ | తెలుగు ట్రెండ్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language