Type Here to Get Search Results !

దండుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 దండుపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మనోహరాబాద్:(తెలుగు ట్రేండ్స్ )

మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా, దేశభక్తి పరిమళించే వాతావరణంలో జరిగాయి. దండుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మరాఠా నాగరాజు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... మన దేశ స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం అమరులైన యోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ ఐక్యంగా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.

ముఖ్య నాయకులు, ప్రజల భాగస్వామ్యం:

ఈ వేడుకల్లో స్థానిక నాయకుడు పంజా భిక్షపతితో పాటు పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఇతర స్థానిక నాయకులు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంపిణీ చేశారు.

జరిగిన స్వాతంత్ర దినోత్సవ పాఠశాల సాంస్కృతిక వేడుకలు అహుతులను అలరించాయు. రిపోర్ట్ R చంద్రశేఖర్ 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

తెలంగాణ & మెదక్

```html ```

#codes

🌐 Select Language